అరగంట...శ్రీనివాస భారతి
అరగంట...శ్రీనివాస భారతి
"హలో ఎవరు ఫోన్ చేసింది?"
"నేనే"
"నేనే అంటే?"
"నేనే"
"శిరీష"
"ఆహా"
"సౌందర్య"
"ఆహా"
"ప్రజ్వల"
"కాదు"
"రాణి"
"మళ్ళితప్పు"
"విశాల"
"ఎంతమందున్నారేంటి నీకు"
"ఐతే నువ్వు జ్యోతిర్మయి"
"అబ్బా కరెక్ట్"
"ఇంతకి ఫోనేందుకు చేసినట్టు?"
"ఊరికే"
"ఊరికే ఎవరూ చేయరు. విషయం చెప్పు"
"రేపు నా బర్త్డే..నీవొక్కడికే ఫోన్ చేస్తున్నా"
"సరే"
"వచ్చేటప్పుడు....నీ కో సర్ప్రైజ్ గిఫ్ట్"
"చెప్పాలి"
"నన్నింతకుముందు ఎప్పుడూ చూడనివిధంగా
కనీసం అరగంట నీకోసం...."
"ఏమదృష్టం..ఎంతకి రమ్మంటావ్?"
"సాయంత్రం 6 తర్వాత?"
"నీకోసం గోల్డ్ రింగ్ తెస్తున్నా"
"కొలత తెలీదుగా?"
"ఐతే...చైన్...?"
"ఆ అరగంట ఫొటోస్/ వీడియోస్..."
"నీ ఇష్టం.. ఐతే డోంట్ టచ్..గ
ిఫ్టుఅన్నావ్?"
"ఎప్పుడివ్వాలి... సాయంత్రం?"
"నో...ఉదయం...కొరియర్.."
"యెస్..అలాగే.."
పది గంటలకు కొరియర్ అయ్యాక...మంచి సెల్ కోసం వేట మొదలైంది.
సాయంత్రం 5.30 కు వెళ్ళాడు..
అరగంట సేపు వాళ్ళిద్దరికి ఎవరూ ఆటంకం కాలేదు.మిగతా గదుల్లోనే అందరూ సర్దుకున్నారు..
తలుపుల్లేని ఆగదిలో వాళ్ళిద్దరే..
సుందరరావు గాలి తీసేసినట్టైంది.
సరిగా అరగంట పోయాక తాతగారిచ్చిన కొత్త డ్రెస్ తో బాటు బాగా మేకప్ వేసుకొంది జ్యోతిర్మయి..
అప్పుడర్ధం అయ్యింది అతడికి...
ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని విధంగా అంటే ఏమిటో....
చింపిరి జుట్టు, నలిగిన బట్టలు, లేని బొట్టు, పౌడర్
వగైరా వగైరాల్తో...
నీరసంగా వస్తానని వెళ్ళిపోయాడు సుందరరావు.. బర్త్డే వేడుక చూడకుండానే.......
ఫాంట్ లోని కొత్త సెల్ నవ్వుతోంది.
★★★★★★★©©©©©©©©★★★★★★