Dinakar Reddy

Fantasy Thriller

4  

Dinakar Reddy

Fantasy Thriller

అంతరిక్షం.. అడుగు దూరంలో..

అంతరిక్షం.. అడుగు దూరంలో..

1 min
305


ఆ తలుపు తియ్యకు, విష్ణు అరుస్తున్నాడు. అప్పటికే నేను తాళం పని చేయట్లేదని తలుపుకున్న అద్దం మీద కొట్టీ కొట్టీ కొద్దిగా క్రాక్ తెప్పించాను.


నీకేమైనా బుర్ర పని చేస్తోందా అంటూ తలుపుకున్న అద్దం మీద ఏదో ఫోమ్ లాంటిది వ్రాసాడు. 


నిన్న రాత్రి మేము స్పేస్ షిప్ లోకి వచ్చాము అనే విషయం అర్థమైంది. 

అసలెవడ్రా నన్ను ఇందులోకి తీసుకు రమ్మంది అని చిరాకు పడ్డాను.


బిగ్ బాస్ షోలో ఇచ్చే కమాండ్ లాంటి గొంతుక వినిపించింది.


ఆట ఆడితేనే తిరిగి ఇంటికి వెళ్ళేది అంటూ ఇంకా కొంత మంది మాతో కలిసి చేరారు.


ఇదేదో ట్రాప్ లా ఉంది అనుకుంటూ మళ్లీ ఆ తలుపు దగ్గరికి వెళ్ళాను. బయట ఏదో ఎర్రటి నేల కనిపిస్తోంది. 


ఒరేయ్! బయటంతా ఎర్ర నేలరా అన్నాను విష్ణుతో.


నీ బొందరా. అసలు మనం భూమ్మేదే లేమురా. బయట ఆక్సిజన్ ఉండదు. వెళితే చస్తాం అన్నాడు. నాకు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది.


Rate this content
Log in

Similar telugu story from Fantasy