STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Inspirational Others

4  

Jayanth Kumar Kaweeshwar

Action Inspirational Others

"యువతా! మంచిని అనుసరించు" కవీశ్వర్ : 23.01.22

"యువతా! మంచిని అనుసరించు" కవీశ్వర్ : 23.01.22

1 min
330

23. 01 .2022 

అంశం: దేశాభివృద్ధిలో యువత పాత్ర 

శీర్షిక: "యువతా! మంచిని అనుసరించు" 

>>వచన కవితాసౌరభం >>కవీశ్వర్ >.

కవిత..మంచి ఆలోచనల చే తల్లిదండ్రులు మిమ్ములను పోషించి పెంచుతుంటే ,

      తెలిసి తెలియని వయసులో చేసిన పొరపాట్లను క్షమించి ఊరుకుంటుం టే ,

     అది కావాలంటూ, ఇది కావాలంటూ హటంచేస్తే ఒక పరిమితితో కాపాడుతుంటే,

     ఆ అలుసే,చేతకానితనంగా భావించివారినే నిందించే గమ్యం తెలియనికొందరు .

పాఠశాలలో విద్యా సంస్కారం నేర్పే గురువులను, మంచి సలహాలనిచ్చే బంధువులనే,

ఎదురించి వారినేసమస్యలసుడిగుండంలో పడవేయు ఇంకొందరి వ్యవహారంఅభ్యంతరమే,

సమాజంలో కళాశాలల్లో,తమకిచ్చవచ్చినట్లు ప్రవర్తించి, ప్రాణాలకేఎసరుపెట్టుకుని కష్టాలే ,

కుటుంబాల పతనం దిశగా పయనింపజేసి , జీవితాలను సర్వనాశనం ఒనరించు కుసంస్కారి .

      ఇతర ప్రభావాలకులోనుకాక సాత్విక పద్ధతు నలవరచుకునే తన కుటుంబ అభివృద్ధి ,

      ఆత్మవిశ్వాసము, ఇతరులవల్ల మంచిని గ్రహించే నమ్రత , మోసం, కపటంలేని కర్మ ,

      నమ్మిన సిద్ధాంతాన్ని,ఆశయాలకుస్వల్పకారణాలచే తిలోదకాలనివ్వకపోవడం ధర్మం,

     నీవు ఎదుగు,ఇతరులనుఎదుగనివ్వు, దేశఅభివృద్ధిలోఉన్నదానితోపాలుపంచుకోవడం,

వ్యాఖ్య : "ఎలాంటి చెడుప్రభావాలకు లోను కాకుండా , ఇతరులకు చెడుతలపెట్టకుండా, మేధావుల తలలో నాల్కలవలె ఎల్లప్పుడూ నమ్మిన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ , స్వా అభివృద్ధి తో పాటుగా దేశాభివృద్ధి కి యువత పాటుపడితే , నీవు, నీ కుటుంబము, నీ దేశం అభివృద్ధి పధంలో తప్పక పయనిస్తుంది."   



Rate this content
Log in

Similar telugu poem from Action