మాధ్యమాల్లో మరుగవుతున్నమనిషి
మాధ్యమాల్లో మరుగవుతున్నమనిషి
సందు చివర ముచ్చట్లను
సోపతిగాని సొల్లు మాటలను
ఎదురింటి వెంకమ్మలాగా
రచ్చబండ వద్ద రచ్చ రచ్చ
(వైరల్ ) చేయటంలాంటివి
వాట్స్అప్ ఏ నాటికి భర్తీ చేయలేదు..
దోస్తుగాని నవ్వు ముఖాన్నీ
శత్రువు ఏడుపు ముఖాన్నీ
దెయ్యం భయంతో బిగుసుకు పోయిన
మా బుజ్జిగాడి ముఖాన్ని
మా చిన్ని పాప అమాయకపు ముఖాన్ని
సిగ్గుతో ముడుచుకుపోయే సీత ముఖాన్నీ
నీ ఇమోజీలు ఏనాటికి చూపించనులేవు...
నీ ఫెక్ ఫేస్, నీ ఫేక్ కళ్ళు
నీ ఫెక్ నవ్వులు, నీ ఫెక్ ముచ్చట్లు
నీ ఫెక్ స్నేహితులు,
నీ ఫెక్ మనసు లాంటివి తప్ప
నీ కళ్ళలో దాగి ఉన్న ధైర్యాన్ని
నీవు గడించిన అనుభవాన్ని
నీవు భౌతికంగా ఇచ్చే స్ఫూర్తిని
నీ ఫేస్బుక్ ఏ నాటికి కనబరచలేదు.....
నిజమైన ఉపాధ్యాయుని బోధనను
నిజమైన తరగతి గది ఛాలెంజింగ్ వాతవరణాన్ని
గూగుల్ మీట్ లో మీటింగ్ లు
వెబ్ ఎక్స్ లో ఎడ్యుకేషన్ క్లాస్ లు
జూమ్ ప్రేములు ఏ నాటికి సృష్టించనులేవు....
ట్విట్టర్లో నీ ట్విట్లయిన....
టెలిగ్రాంలో సందేశాలైన.....
మెస్సంజర్లోని మేసేజ్ లైన....
స్కైపులో నీ వలపుల కైపులైన....
ఇన్స్టాగ్రామ్ లో నీ ఇమేజెస్ అయిన....
అసలయిన మనిషిని .....
సీసలయిన మనసును భర్తీ చేయలేవు.......
సోషల్ మాధ్యమాల్లో బానిస
కాబోతున్న మనిషి ఇక మేలుకో !
మమతానురాగాలతో మసులుకో!!
మానవత్వ పరిమాళలను మళ్ళీ వికసింపజేయి!!!
