STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

యుద్ధం

యుద్ధం

1 min
318

భయంకరమైన ఆలోచనలతో

నిత్యమూ ఒక పోరాటం

గుర్తింపు లేదని బాధలు

కెమెరాల నుంచి తప్పించుకుంటే చాలనే ఆశలు


ఒకరు ఎడారి వెంట

మరొకరు కెరటాల వెనుక

యాసలు భాషలు

తిట్లు చివాట్లు

వెరసి ఎన్నో ముచ్చట్లు


మాటలకందని మౌన గీతాలు

ప్రేమంటే పడని గుండెలు

వెంట పడి వేధించే ఆలోచనలు

యుద్ధం చేసిన తరువాత

ఫలితం ఇలా ఉందని

ఆలోచించే సమయం ఉండదు


నువ్వు చేసే యుద్ధం నీతోనే

ఇక్కడ గెలుపు కన్నా

నిన్ను నువ్వు మార్చుకునే మలుపే ముఖ్యం

నిన్ను నువ్వు స్వీకరించడం ముఖ్యం


అంతా విన్నా

ఏమీ ఎక్కనట్లు

అలా దిక్కులు చూడకు

విరామం తీసుకుని

విజయమంటే ఏమిటో తెలుసుకో..


Rate this content
Log in

Similar telugu poem from Abstract