వర్షించే-తుఫాను,సునామీలు..
వర్షించే-తుఫాను,సునామీలు..
నా మది దాచుకున్న రహస్యాలు ఎవరి చూపుకు అందని అగాధాలు..
నా నల్ల కన్నులో పడి మునకలేస్తున్న కన్నీరు గట్టు తెగిన గోదావరి వరదలు..
మౌనమైన మది పెదవులని కాదని ఏ విరుల లాస్యం చేయలేని స్పందించని శిలాఫలకాలు..
మనసు తెగి ఎదురు చూస్తున్న గాయాలు గాలిపటంలా చెలరేగే మనసును ఏ దారం బందించలేని బాధలు..
కళ్ళలో కాగిన కన్నీటి జరులను జారవిడవలేకున్న కళ్ళు..
ఏది చేయలేక గుండెల్లో బరువు మదిలో భూకంప ప్రకంపనలు సృష్టిస్తున్న సుడిగుండాలు..
మనసు నరనరంలో సుడులు తిరిగే కన్నీటి కావేరి నదీ ప్రవాహాలు..
కటిక చీకటిలా మనసుకు ముసురుకున్న కారు మేఘాలు
ఏ క్షణం అయినా వర్షించే తుఫాను,సునామీలు....
