జీవిత ప్రవాహం
జీవిత ప్రవాహం


ఎందరో ఎన్నో మాట్లాడుతారు
ఎన్నెన్నో తీరుల చెప్పి జ్ఞానమంటారు
కాలమంతా కరుగుతుంటే
బంధాల మోహాలు లాగుతుంటే
బ్రతుకు చక్రం ఈడుస్తున్నాం అంటారు
కానీ ఎవరు ఆపగలరు జీవిత ప్రవాహాన్ని
జీవితం చివరకు చేరుకుంటే
ఎవరు దానిని మరల ప్రవహింప చేయగలరు
అంతా అశాశ్వతం అని తెలిసినా
అంగీకరించని ఓ మానవుడా
నీకు ఎవరైనా ఏమని చెప్పగలరు