వృక్షములు సల్లాపం చేస్తే !
వృక్షములు సల్లాపం చేస్తే !


మేము భూమిలో ఉన్న స్థిర ప్రాణులం,
ధరణి ని హరితంగా ఉంచే మూగ జీవులం |౧|
నిరంతరం ఇస్తున్నాం జీవకోటికి ఆమ్లజని,
ఈ ప్రాణవాయువు వసుంధరకి అయ్యెను సంజీవని |౨|
మేమె ఇచ్చెను మనిషికి వంటచెఱకు కలప,
మావలనే లభించెను ప్రాణులకు పండ్ల గంప |త్రీ|
ప్రకృతికి ఎంతో అవసరం సస్యశ్యామల అడవులు,
సముద్రతీరానికి ఎంతో అవసరం మడ అడవులు |౪|
మా వేళ్లు బంధించెను భూమిలో మృత్తిక,
అనంతం ఈ మహత్ కార్యం చేస్తున్న వన వృక్షాల సూచిక |౫|
సాధ్యమైనంతవరకు మేము చేస్తాం కాలుష్య నివారణ,
కానీ మానవుడు పెంచుకుంటూ పోతున్నాడు కాలుష్య రక్షణ |౬|
మేము లేనిదే ధరిత్రిలో లేదు జీవితం,
భూమిలో ప్రతి వృక్షం ఒక పరిమళ పారిజాతం |౭|
మాలాంటి వృక్షాలు సల్లాపం చేస్తే తెలిసెను ఎన్నో విషయాలు,
విని కొంతమందైనా స్పందిస్తే లభించెనేమో కొత్త పరిష్కారాలు !! |౮|