STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

వీధికో నాయకుడు

వీధికో నాయకుడు

1 min
344

ప్రజాస్వామ్య దేశంలో

భావప్రకటన స్వేచ్ఛ

ఎవరికి దక్కేనో

అని ఎదురు చూడవలెనా


పరులకు మేల్ తలపెట్టిన

మతి భ్రమణ అని వ్యాఖ్యలు

దేశం గురించి నీకెందుకు

అని ఉచిత సలహాలు


నాకేం అంటే నాకేం

అని విదిలించుకుని పోయేవారిని

నా ఇంటి సమస్య కాదుగా

అని వినీ విననట్టు ఉండే వారిని


చూసి చూసి

ఒక బక్క పలుచని దేహానికి విసుగొచ్చింది

ఆత్మ సమర్పణ భావంతో రాట్నం తిప్పిన చేతులవి

ఈనాడవి మ్రొక్కుతూ యువతను నిదుర లేవమంటున్నాయి


బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కదిలించిన సత్యాగ్రహంలో

ఉప్పు తయారు చేసిన చేతులవి

దేశం గురించి కాస్త ఆలోచించమని

నాయకుల్ని దణ్ణాలు పెడుతూ అడుగుతున్నాయి


వీధికో నాయకుడు ఎదురవుతూ

మా పార్టీ జెండా పట్టుకో అని

ఆ చేతులకు పని చెప్పాయి

బరువెక్కిన ఆ చేతులు

భరతమాత వైపు చూశాయి

శ్వాసల్లో కూడా నా దేశం నా దేశం

అని తపించే ఆ ప్రాణి ఇక పోరాడలేను అంటోంది


భారత దేశ త్రివర్ణ పతాకం తాకాలని

ఈ పుణ్యభూమి మట్టిని తనువుకు రాసుకుని

తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది

ఆ దేహం

ఎవరైనా ఎప్పుడైనా 

భారత్ మాతాకీ జై అని 

మనసారా అన్నప్పుడు

ఆ చేతులు వందనం చేస్తూ ఉంటాయి

ఆకాశంలోంచి



Rate this content
Log in

Similar telugu poem from Abstract