STORYMIRROR

# Suryakiran #

Thriller

4  

# Suryakiran #

Thriller

వీడని బంధం !

వీడని బంధం !

1 min
289

ఎవరికివారయ్యే ప్రత్యేకతగల సమయంలో

మనసుతోనే అధికంగా అనుబంధం .

అంతవరకు చేసిన ప్రయాణంలోని అనుభవాలు ,

లోలోనికి చొచ్చుకువచ్చి సరికొత్తదనాన్ని

నింపినవారిని తలుస్తూ చేసే దరహాసాలు .


నేడూ హృదయాన్ని తడుతూ ఒకే ఈడువారు .

వయసేదైనా అనేకులు తమతమ దృక్పథాలతో

కళ్ళముందున్న లోకాన్ని పరిచయం చేస్తూ .

రాబోయేకాలమే ఏం దాచిందా అనే ఆసక్తితో

అడుగడుగులో తననుతాను కనుగొనుచూ !


మనసులు ఒకటయ్యే తరుణం వచ్చిందా ,

అసలు ప్రపంచంలోనే కలసి విహారం .

ఆ జోడుగుర్రాలు ఎప్పుడూ రెక్కలు కట్టుకునే ,

విరహంలోనూ బంధంలోని మాధుర్యాన్ని

స్పష్టంగా ప్రతిబింబించే సన్నాహం !! 



Rate this content
Log in

Similar telugu poem from Thriller