STORYMIRROR

EERAY KHANNA

Drama Classics Inspirational

3  

EERAY KHANNA

Drama Classics Inspirational

వేగం పెరిగింది

వేగం పెరిగింది

1 min
224

        " వేగం పెరిగింది " - రాజేష్ ఖన్నా

           ========================

మనుషుల ఆలోచనల్లో అడుగుల్లో

ఆర్భాటాల్లో, ఆనందాల్లో వేగం పెరిగింది

మనసులో చీకటిలా కదిలే భావాలకి

గుండెల్లో గూడుకట్టుకొనే భయాలకి

ఆలోచనల మాటునా నక్కే అసూయలకి

ఆకలికేకల నడుమ నడిచే ఆర్తనాదాలకి

మనిషి మాటలకి మనిషిని చంపే తూటాలకి

ఆ తూటాలు చిత్తుగా కూల్చే కోటలకి

ఆ కోటల్లో రహస్యాలుగా మార్మోగిన పాటలకి 

రాగం రగిలి వేగం పెరుగుతూనే ఉంది

వదిలేసే ఆలోచనలతో మనిషి కదలడు

వరదై వాలిపోయాకా పరుగులు తీస్తాడు

వేగంగా కదిలే ఆలోచనలకి పాదులు వేస్తాడు

వెన్నెలవెలుగులో ఆలోచనతారల్ని ఏరుకోడానికి

వెలిసిపోయిన జీవితాన్ని తవ్వుకోడానికి

వెలవెలబోయిన ఆలోచనల్తో నవ్వుకోడానికి

అర్థంకానీ వేగంతో పరుగులు పెడతాడు 

చీకటిసూర్యుడికి కాంతుల్ని అతికించి

ఆ వెలుగులో మబ్బుల్నేరుకొని మూటగడ్తాడు

మాసిపోయిన కళ్ళుమూసుకొని పరుగుపెడ్తాడు

మనిషిచేసే మోసాల్లో, రంగులేసుకొనే వేషాల్లో

అవసరానికి మార్చుకొనే భాషల్లో వేగం పెరిగింది

మనసుని చంపుకొని నగ్నత్వాన్ని చూపడానికి

ఆచారమనే పేరుతో మూఢత్వాన్ని ప్రదర్శించడానికి

తమలోని నీచత్వాన్ని రహస్యంగా దాచడానికి

మనిషి మనసులోని తెగువకి వేగం పెరిగింది

నడివీధిలో నడవలేని పడవల్లోంచి గాలాలేసి

ఒళ్ళంతా తూట్లుపడ్డ కడవళ్ళోంచి నీళ్లు తోడేసి

మనిషిచేసే విన్యాసాలకు వేగం పెరిగింది

తాను నేర్చుకొన్న జీవితానికి వెలకడుతూ

వీధిలో పెట్టి అమ్మేవాళ్లకు వేగం పెరిగింది

    

            ****** సమాప్తం******



Rate this content
Log in

Similar telugu poem from Drama