వాడని వలపు
వాడని వలపు
ఎదలో ఏవో సొదలు
సోదా చేసినా దొరకని దిగులు
అది నలుపా
అవునా ఏమది
నీ మదిని తొలుస్తున్న ఆ తలపు ఏమది
వలపు విహారమది
వేల పూవుల సుగంధములు వెదజల్లి
నా మనసును దోచిన వారి ప్రభావమది
అది తెలుపా
నిదురను దరి చేరనీక
పరవశమను భావమున నన్ను మంచి
పలుకలేని బాసలు చేసిన వారిని
ఎట్లు మరువగలను
అది గోధూళి రంగు కాబోలు
ఓ మనసా
మాటలు చెప్పిన చాలునా
వెర్రిగా వెంట పోదువా
వివరము తెలియక వగచుటేల
నీ మదిన వాడదని అనుకున్న వలపు
నిన్ను ఎప్పుడో వీడినది
కానీ తన ముఖచిత్రము
ఇంకా హోలీ రంగుల వలె ప్రతి ఏడాదీ గుర్తుకు వస్తున్నది.

