తస్మాత్ జాగ్రత్త
తస్మాత్ జాగ్రత్త


అరాచకం
నోరు తెరిచింది
నీతిని
మింగేయాలని...!
ఆధిపత్యపు హోరేగా
ఎక్కడ చూసినా
సామాన్యుడిని
కట్టడి చేస్తూ...!
ఎదురుతిరిగే
నాయకుడొకడుండి
జనసైన్యం తోడుంటే
అన్యాయానికి చోటెక్కడ...!
కదలాలి
నలుమూలలా
ప్రతిదేశం
చైతన్యపథం వైపు...!
జాగుచేస్తే ఖాయమే
మృగాలై
మింగేస్తారు ఈభూమిని
తస్మాత్ జాగ్రత్త...!!