Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kadambari Srinivasarao

Inspirational

4  

Kadambari Srinivasarao

Inspirational

తపోవనం

తపోవనం

1 min
392


ఔను! నిజంగా అది తపోవనమే!

అక్కడ నల్లబల్ల తోటలో

స్వచ్ఛమైన వర్ణం పూసుకున్న అక్షరసుమాలు

బాల పక్షులను ఆకట్టుకుంటాయి

జ్ఞాన పరిమళాలను వెదజల్లుతూ..


వినూత్న రుచుల సమ్మేళనంతో నిండిన

వికసించే ఆ పదరాసుల మకరందం

దక్కినంత చిక్కించుకుని

మస్తిష్క ఆకలిని తీర్చుకుంటాయి

నిత్యం సాయం సంధ్యవరకూ గ్రోలుతూ..


చదువుల యజ్ఞంగా సాగే ఆ తపోమడిలో

కంకణ బద్ధులై శ్రద్ధ అనే ఆజ్యం పోస్తూ

కాదంబరి అనుగ్రహ సిధ్ధికోసం

చిరుహృదయాలు నిరంతర దీక్ష సాగిస్తాయి

శ్రీకారపు మంత్రాలను వల్లెవేస్తూ..


గురు తరువుల నీడన సాగే బుద్ధితపస్సుతో

జ్ఞాన గువ్వల భవిత సాకారమై

అక్షర నిధులు సిద్ధించాలని

తపోవనం నిత్యవసంతం పూయించాలని

మనో ఫలకంలో లిఖిద్దామా..



Rate this content
Log in

Similar telugu poem from Inspirational