🌹 తొలిమాధుర్యం 🌹
🌹 తొలిమాధుర్యం 🌹
🌹 'తొలి'మాధుర్యం 🌹
రచన :- అంజనీగాయత్రీ.
స్నేహబంధంగా నిన్ను కలిసిన నా తొలిపరిచయం ఎంతో మధురమైన క్షణం!!
ఆ తొలి పరిచయమే మనిద్దరి తొలిప్రేమకి దారి తీసిన వైనం ఇంకా మధురాతి మధురమైన క్షణం!!
నా గుండెగూటిలో కొలువైన నువ్వు నా చేయి అందుకుని నా చెంత చేరడం ఎంతో మధురమైన క్షణం!!
వివాహాఘట్టంలో జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు మన తొలి చూపుల కలయిక ఎంతో మధురమైన క్షణం!!
వివాహ వార్షికోత్సవ రోజు నాడు మన వివాహ వేడుక కళ్ళముందు కదలాడడం ఇంకా మధురమైన క్షణం!!
తొలిప్రేమకు గుర్తుగా త
ొలి సంతానం మన చేతిలోకి వచ్చినప్పుడు తల్లిదండ్రుల వాత్సల్యం ఎంతో మధురమైన క్షణం!!
పిల్లలు పెరిగి పెద్దవుతుంటే, తప్పటడుగులు వేస్తు నడకనేర్చినప్పుడు, తొలి పలుకులు పలికినప్పుడు ఎంతో మధురమైన క్షణం!!
తొలిసారి పిల్లల్ని బడిలో వేసినప్పుడు , ఓనమాలు నేర్చుకున్నప్పుడు, వచ్చే ఆనందం ఎప్పటికి గుర్తుండిపోయే మధురమైన క్షణం!!
బడిలో గురువుల వాత్సల్యపూరిత బోధలు, తప్పు చేసినప్పుడు మందలింపులు, ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన క్షణాలు!!
చదువు పూర్తయి బడిని వీడి వెళుతున్నవేళ స్నేహితుల, గురువుల వేదనాభరిత వీడ్కోలు ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన క్షణం!!.