STORYMIRROR

Gayatri Tokachichu

Children

4  

Gayatri Tokachichu

Children

తల్లి తండ్రులు - పిల్లలు

తల్లి తండ్రులు - పిల్లలు

1 min
368

చదువుకై నిత్య సమరంబు జరుపుచుండి

నీరసించక బిడ్డలు నిష్ఠతోడ

దృఢ చిత్తులై మెల్గుచు

తిరముగాను

తల్లి తండ్రుల కోర్కెలన్ దల్చుకొనుచు

సాగుచుందురు పాపమీ సమయ మందు.


ఆటలాడుద మన్నచో నాట కొఱకు

స్థలము లేనట్టి బడులలో చదువుకొనుచు

మాట లాడెడి వారింట మసలకున్న

దిక్కు తోచని పిల్లలు దీనులగుచు

సెల్లు ఫోనును బట్టిరి చింత తొల్గ.


వంట చేసెడి తల్లులు పనుల కొఱకు

బయలు దేరగా పిల్లల బాగు నెవరు

చూచు చుందురీ కాలము చుట్టు కొనగ

నిస్సహాయులై బిడ్డలు నెనరు మరిచి

క్రోధ గుణముతో బెరుగుచు కూలుచుంద్రు.


కథలు చెప్పెడి బామ్మలు కానరారు

నిత్య ఘర్షణ పడుచుండి నీల్గుచున్న

తల్లి తండ్రులన్

గాంచుచు దారి లేక

మత్తు మందులు వాడుచు మహిని మరిచి

చిన్న పిల్లలు మున్గిరి చింతలోన.


ధనము కోసము పిల్లలన్ దల్చుకొనక

క్రష్షు లందున ద్రోయగా కాలిపోవు

సకల బంధముల్ యని దల్చి సమధికముగ

తల్లి తండ్రులు బాధ్యత తప్పరాదు.


దోషమంతయు యువతపై త్రోసి వేసి

నింద వేయుచు బిడ్డలన్ మందలించి

గడుపు చుందురు తలితండ్రి ఘడియ ఘడియ.

తప్పు పెద్దలదౌకదా దయను వీడి

పిల్ల పాపలన్ దిట్టుట పెద్ద తప్పు.


జీవితంబున దప్పులన్ జేయుచుండి

దిద్దు కొనరండి పెద్దలు తీరుమార్చి.


బిడ్డలందరు ప్రేమగా పెరుగుచున్న

భావి తరములో నిల్చును బసిడి వెలుగు.


Rate this content
Log in

Similar telugu poem from Children