STORYMIRROR

Gayatri Tokachichu

Children

4  

Gayatri Tokachichu

Children

వానాకాలం

వానాకాలం

1 min
366

*వానాకాలం* (బాలగేయం )


వానాకాలం వచ్చింది

వానాకాలం వచ్చింది

మొయిలు కన్నెలు వచ్చిరి

ఆశల వరముల నిచ్చిరి

చల్లని గాలులు వీచెను

జల్లని వానలు కురిసెను

మన్నున వాసనలు నిండగా

మనసున తోషము పొంగగా

పొలములు దున్నగ సైరికులు

కదిలిరి పట్టుచు హలములు

తరువుల నిండుగ చిగురులు

విరివిగ కాయును ఫలములు

కళకళ లాడెడి కాలువలు

మిలమిల మెరిసెడి జలములు

గంతులు వేయుచు చేపలు

సంతసమొందిన పక్షులు

సిరులను పంచెడి పల్లెలు

మురియుచు నాడెడి పిల్లలు

పెరిగెను చేలో పంటలు.

మ్రోగెను గుడిలో గంటలు.//


Rate this content
Log in

Similar telugu poem from Children