STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Classics Inspirational Children

4  

Thorlapati Raju(రాజ్)

Classics Inspirational Children

అమ్మ!

అమ్మ!

1 min
392


అమ్మ... అమ్మా..


ఈ సృష్టికి..

అమ్మ..అమ్మ..అనే..పేరు

తలవకుండ..రోజు గడవదమ్మ


బిడ్డకు తల్లి ప్రేమ లేకుండా..

తనువు నిలువదమ్మ


అమ్మా...

పదేళ్ల..అప్పుడు

నిన్ను ప్రేమించాలి అనుకున్న

కానీ..ఆటపాటల్లో..అలసి పోయి

తిరిగి నీ ప్రేమకోసమే ఎదురు చూసా!


పదహారేళ్ళ వయసులో నిన్ను

ప్రేమించాలి అనుకున్న...

కానీ..వయసు చేసే అల్లరికి

అతలాకుతలం అయిపోయి

తిరిగి అమ్మకోసం మే..చూసా!


పెళ్ళయాక నిన్ను ప్రేమించాలి అనుకున్న

కానీ! సంసార సాగరంలో మునిగి పోతు

మళ్లీ..నీ ప్రేమకోసమే..మననం చేసానమ్మ


ఇలా

ప్రతి దశలోనూ..

ఏదో ఒక అడ్డంకి ఉందమ్మా అని

సాకులు చెప్పుకొని..

గడిపేసే ఘనులమమ్మ..మేము!


కానీ ఆశ్చర్యం ఏమిటంటే అమ్మ

నీకు నన్ను ప్రేమించటం లో

ఏ అడ్డంకి రాకపోవటం అమ్మ


ఆ..

ఇపుడు అర్థం అయింది అమ్మ

అసల అడ్డంకి..

వాళ్ళు వీళ్ళు..అవి ఇవి..కావమ్మ

నాకు నేనే..అడ్డంకి!


సృష్టిలో.. ప్రేమంటే..

ఆశించకుండా..ఇతరుల ఆనందాన్ని

కోరుకునేది..అని

నిస్వార్థంగా..చేసి చూపించావ్!


అందుకే.. అమ్మా

ఇప్పటికైనా...ఎప్పటికైనా..

నిన్ను ప్రేమించాలి అనే.. నా

మనసు..పలుమార్లు..తపిస్తుంది అమ్మ

కానీ!

ఆమ్మ ప్రేమ అంతటి ప్రేమ..

ఇవ్వాలి అంటే..

అమ్మే..అయి ఉండాలి అమ్మ!

నీ ప్రేమకు..వేరెవరూ సాటి రారు అమ్మ!


       ......రాజ్.....



Rate this content
Log in

Similar telugu poem from Classics