తెలుగు పాట
తెలుగు పాట
----------------------------
పల్లవి //
తెలుగు బాల లేవరా!
తెలుగు పాట పాడరా!
చరణం //
కవులహృదయ భాషలో
నవత నింపి యాసలో
పల్లవి //
తెలుగుబాలలేవరా!
తెలుగు పాట పాడరా!
చరణం //
పలుకు పంచదారలా
చిలికి మధురధారలా
పల్లవి //
తెలుగు బాల లేవరా!
తెలుగు పాట పాడరా!
చరణం //
జవము నిచ్చు శ్వాసతో
భవితనిలుపు భాషతో
పల్లవి //
తెలుగు బాలలేవరా!
తెలుగు పాట పాడరా!
చరణం //
నిలిచి పోవు కీర్తిగా
వెలుగు నిచ్చు స్ఫూర్తిగా
పల్లవి //
తెలుగు బాల లేవరా!
తెలుగు పాట పాడరా!
చరణం //
తెలుగు పాట శాశ్వతం
తెలుగు మాట జీవితం.
పల్లవి //
తెలుగు బాల లేవరా!
తెలుగు పాట పాడరా!//
------------------------
