STORYMIRROR

EERAY KHANNA

Children Stories Inspirational Children

4  

EERAY KHANNA

Children Stories Inspirational Children

" జీవితాల మేస్త్రి "

" జీవితాల మేస్త్రి "

2 mins
636

         " జీవితాల మేస్త్రి "   -  రాజేష్ ఖన్నా

     ================================

మనసులోకి మనుషుల్లోకి మంచితనాన్ని చేర్చి

విజ్ఞతావివేకాన్ని విద్యార్థుల జీవితాల్లోకి కూర్చి

విశ్వానికి విజ్ఞానపు పరిమళాల దప్పికని తీర్చి

అరకొర జీతానికి అరిగిపోయిన తన జీవితాన్ని

తాకట్టుపెట్టి తన కష్టాల్ని పక్కకునెట్టి

శిష్యులజీవితాలు శిఖరాగ్రాలు చేరేలా

అజ్ఞానాంధకార బ్రతుకులు సహితం మారేలా

అహోరాత్రులు అకుంఠితశ్రమతో శ్రమించి

మస్థిష్కాలు మత్తుగా మాసిపోకుండా వివేకపు

ఇటుకలతో వికసించే విజ్ఞానపు బండాగారాల్ని పేర్చిన

గురువనే మేస్త్రికి భక్తితో కొలిచే గుడారామెక్కడా

నల్లబల్లరంగు జీవితాలు అక్షరాల్ని అందుకొని

ఆ అక్షరాలదారుల్లో అక్షయపాత్రల్ని పొందుకొని మలినమైన మట్టిచేతులు అక్షరాల్ని రాసుకొని

మణిమాణిక్యాల రాసుల్ని గుట్టలుగా పోసుకొని

పసిడివర్ణాల ఆర్భాటాలతో పండగలు చేసుకొని

తమ ఆనందాలకు వంతనలేసిన గురువుకింత

గూడుకట్టకపోయిరి కదా

వధువుకి వన్నెతెచ్చే అలంకారాలేంతసేపు

వరాలిచ్చే దేవుడికోసం పూజలెంతసేపు

విద్యార్థి జీవితాన్ని కట్టే మేస్త్రి బ్రతుకంతైతే కాదు కదా

వధువు నవ్వులు, పూజా పువ్వులు వాడిపోతాయి

విద్యార్థికేసినా మెరుగులు క్షణక్షణానికి వెలిగిపోతాయి

గురువేసిన అక్షరాలముగ్గులు చెదిరిపోతాయి

విద్యార్థి మెదడులో శిలాశాసనాలై మిగిలిపోతాయి

జీవితాలవెలుగుల్లో నిక్షిప్తమై నిలిచిపోతాయి

శిల్పిచేతికి తలవంచని బండరాయి

నాగలిమొనకి చనువియ్యని మట్టినేల

గాయాలకు తలొంచి తనువియ్యకపోతే

తగిన ఫలితమెక్కడా 

గాయాలు లేకుండా మాయవలలు వేయకుండా

విద్యార్థి మెదడులోకి మెత్తగా విజ్ఞానపు పానకాన్ని

మనసులోకి విలువల్నిచేర్చే గురువుకి సాటెక్కడా 

జీవితాల మేస్త్రికి గాయాలు చేయడం

జీతంకోసం గారడీలు చేయడం చేతకాదు

బ్రతిమాలి నవ్వించి నేర్పడం తప్పా

మాయచేసి మభ్యపెట్టి పాఠాలు చెప్పడం

మానసికంగా హింసించే మంత్రాలేయడం రాదు

ఇళ్ళు కట్టే మేస్త్రికి ఇంటివారిని ఏడ్పించకుండా

కొంతైనా కొత్త భయాల్ని పుట్టించకుండా

పనిలో కాస్తయినా విసుగు తెప్పించకుండా 

ఇళ్ళు కట్టడం ఇక్కట్లు పెట్టడం అలవాటు

తనపై జోకులేసినా కాకుల్లా అర్చినా 

మారుపేర్లతో మతిచెడి పిలిచినా

మారుమాటాడకుండా మౌనంగా

నల్లబల్లలాంటి మనసుల్లో అక్షరాల్ని నింపేసి

ధవళవర్ణమైనవిగా మార్చే గురువులో తడబాటు

కూల్చడం పేల్చడం రాల్చడం మరిచి

నిలపడం పేర్చడం కట్టడమే తెలిసిన గురువు

సమాజానికి సంస్కృతికి కాడెప్పుడు బరువు

జీతమిచ్చేవాడికి జీతమిచ్చినరోజే జైకొడ్తారు

ఆటగాడు, పాలించేవాడు గెలిస్తేనే గుర్తొస్తారు

నటించేవాళ్లు నవ్వించేవాళ్లు కొట్టుకుపోతారు

ప్రాణమిచ్చినవాళ్ళు ప్రాణంగా చూసేవాళ్ళు

ఆ ప్రాణంతోపాటే కనుమరుగవుతారు

గొప్పోడి ప్రాణమైనా పోయాకా తిరిగిరాదు

గొప్పజీవితం ప్రాణంపోయినా చెదిరిపోదు

ప్రాణం జీవితం ఒక్కటి కానేకాదు

గొప్పజీవితానికి గొప్పప్రాణం లేదు

గొప్ప ప్రయాసకి గొప్ప జీవితం లేదు

జీవితాన్ని నిర్మించే మేస్త్రికిచ్చే కూలీ లేదు

ఆ మేస్త్రికి విలువిచ్చే మనిషి లేడు

అంతా వ్యాపారమే అన్నింటా వ్యామోహమే

ఇళ్ళు నిర్మించేవాడికి గొప్పవ్యక్తిత్వం అవసరం లేదు జీవితాన్ని నిర్మించేవాడికి గొప్పస్థాయి అవసరం లేదు 

ఇంటికి విలువిచ్చి మేస్త్రికి గొప్పపేరు తెస్తారు

జీవితానికి విలువతెచ్చి గురువుకి గొప్పపేరు తేరేం?

కూలిపోయే ఇంటిని నిలిచిపోయే జీవితాన్ని

నిర్మించడం నిలబెట్టడం మేస్త్రిలే అయినా

ఇళ్ళు కట్టినవాడు ఆ ఇళ్ళుతోనే పోతాడు

మరీ జీవితాన్ని నిర్మించినవాడు విద్యార్థిప్రగతిలో

చరిత్రలో నిలిచిపోతాడు

ఇళ్ళు కట్టినవాడిని ఇంట్లో నిలపడం

జీవితాన్ని కట్టినవాడిని చరిత్రలో నిలబెట్టడమే

మేస్త్రికిచ్చే అసలైన సన్మానమని

నేటివిద్యార్థికెప్పుడు తెలియాలి!...

                  **** సమాప్తం****



Rate this content
Log in