భారతీయ జెండా
భారతీయ జెండా
శీర్షిక : భారతీయ జెండా
"""""""""""""""""""""""""""""
పవిత్ర భారత దేశం మనది.
విభిన్న సంస్కృతిల నిలయమిది.
దివి దేవతలు భువిపై వెలసి
నడయాడినట్టి పుణ్య స్థలమిది.
అనంత సిరిల అద్భుతదామం.
కవుల స్వర్గ బృందావనం.
కళాకారుల కళానిలయం.
అదే.. అదే..నా భారత దేశం.
వీరుల త్యాగ ప్రతీక వర్ణం.(కాషాయం)
శాంతి బాట చూపిన తత్వము.(తెలుపు)
పైరుపంటల సిరి పచ్చరంగుదనం.(ఆకుపచ్చ)
అశోక ధర్మచక్రం సాక్షిగా నిలచిన
నా భారత దేశ త్రివర్ణ జండా
పింగలివెంకయ్య నిర్మిత పవిత్ర జండా
జై హింద్... జైభారత్..