STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Classics Inspirational Children

4  

Thorlapati Raju(రాజ్)

Classics Inspirational Children

స్నేహితుడు...

స్నేహితుడు...

1 min
365

స్నేహితుడు...


చెలిమి కి పునాది కలయిక

రెండు మనసుల కూడికలో

లోకంతో ఉన్నా..లోలోపల ఉన్నా

నీ వెంట నేనున్నా అనుకున్న..

రెండు ఆత్మల సహచర్యమే..స్నేహం


జీవితం జగితిలోకి ఆహ్వానించిన

క్షణమ్ము నుండి..

అమ్మా నాన్న ల సహచర్యంతో

తొలి అడుగులు వేసుకున్న స్నేహం

మన ఈడు పిల్లలతో 

మన కుటుంబ సభ్యులతో

మెల్ల మెల్లగా జీవిత రైలు..

స్నేహమనే పట్టాలెక్కింది


సాగుతున్న జీవన యానంలో

యెన్నో మధురానుభూతులు

కొన్ని చేదు అనుభవాలు

గత జ్ఞాపకాలు నెమరువేసుకుంటుంటే

నీరు కార్చని నయనాలు ఉండవు

నెమ్ము తగలని హృదయాలు ఉండవు

యెక్కడ మొదలు పెట్టాలి

ఏది మొదలని చెప్పాలి!


కాలువ గట్టు..కోతి కొమ్మచ్చి చెట్టు

పంచుకు తిన్న అట్టు..శివాలయం మెట్టు

చాట్ బండి కొట్టు ..క్రికెట్ జట్టు

డ్రిల్ మాస్టారి తిట్టు

స్కూల్ యానివర్సరీ స్కిట్టు

ఇంకేం చెప్పాలి..

ఏ దర్శకులు కానీ.. నటులెవ్వరు గానీ

స్నేహం ఎప్పుడూ సూపర్ హిట్టు


నీ గమ్యాలు బట్టి రైలు మారినా

ప్రయాణం మాత్రం పట్టాల పైనే

జీవిత ప్రయాణమెపుడూ.. స్నేహంతోనే


ఉపాధి ఏదైనా ఉన్నది ఎక్కడైనా

ఉగాదికొకసారైనా ఊరూరా కలవండి

స్నేహాన్ని కలకాలం నిలపండి


            .....రాజ్....



Rate this content
Log in

Similar telugu poem from Classics