నది దుఃఖం
నది దుఃఖం
1 min
317
సీతాకోకచిలుక
ఆకు సంధుల్లోంచి చూస్తుంది
ఎండ దేహమంత
అల్లుకుంది
చెమట నది నాన్న శరీరం మీదనుండి
దుమికి
భూమిని ముద్దాడుతుంది.
పానర్ చేతుల్లో కదలాడుతుంది
బండమీద కూర్చున్న కుక్కపిల్లా
తోక మీదనే దృష్టిపెట్టింది
ఎద్దు మేత మీద పడింది
మేఘం దుఃఖాన్ని కళ్ళలో నింపుకొని
చూస్తుంది.
పిట్రోల్ పంపు హృదయం
కదలడం లేదు
స్టార్ట్ చేయాలనుకునే ప్రతీ సారి
నాన్న కళ్ళలో ఆశవెలుగుతూనే వుంది.
చివరగా అలిసిపోయిన నాన్న
బురదలో కాళ్ళని కదిలిస్తూ
మరో రైతు కోసం బయల్దేరాడు.
కొత్త పెట్రోలు పంపు కొనలేని
స్థితి నుండి కొనే స్థాయికి నాన్న ఎప్పుడు
అడుగులేస్తాడనో
నేను నాలోని దుఃఖాన్ని నజ్జునజ్జుగా
నలగొట్టుకుంటు కూర్చుండిపోయా..
(నాన్న పాత పెట్రోల్ పంపుతో పడే తిప్పలని
అక్షరంగా చేస్తూ..)
పేర్ల రాము
మహాత్మాగాంధీ విశ్వద్యాలయం , నల్గొండ