వెళ్తున్న -పేర్ల రాము
వెళ్తున్న -పేర్ల రాము


వెళ్తున్నా....
జ్ఞాపకాలను ,కన్నీళ్ళను
గుండె సీసానిండా నింపుకొని
ఏవో పచ్చినొప్పులతో వెళ్ళాలని
లేకున్నావెళ్తున్న..
నా కలలకు రంగులద్దిన
నా హృదయాన్నినందనంగా మార్చిన
నాలోని నన్ను పరిచయం చేసిన
ఈ పోరాటాల యుద్ధభూమిని ,
నైపుణ్యాల పరియవరణాన్ని, స్నేహితులను,ప్రేమికులను
విడిచి కొంత దూరం పరిగెత్తడం కోసం వెళ్తున్నా...
చాలా గర్వపడుతూ వెళ్తున్నా
చాలా దుఃఖాన్ని మోసుకొని వెళ్తున్న
నువ్వు నా పిడికిలికి నేర్పిన పోరాటం
యుద్ధం చేయడానికి చూపించిన దారులు
అన్నీ అన్నీ నా గుండెనెప్పుడూ&nbs
p;
రగిలిస్తూనే ఉంటాయి..
ఎన్నో జ్ఞాపకాలను కళ్ళల్లో
పదిలపరుచుకొని
మనసును అందమైన
కవితగా మార్చుకొని
ఓ కొత్త జీవితపు పుస్తకాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం వెళ్తున్నా.
వొచ్చేటప్పుడూ
అమాయకత్వాన్ని వెంటేసుకొని వొచ్చా
పోయేటప్పుడూ
కన్నీళ్ళను జ్ఞాపకాలను గుండెసీసానిండా
నింపుకొని వెళ్తున్నా..
వెళ్తున్న
రేపటి జీవితపు జెండాను ఎగిరెయ్యడానికి రేపటినెత్తుటిగాయల్ని ముద్దాడేందుకు
సిద్ధంగా..బలంగా....
(ఐదు సంవత్సరాల హాస్టల్ ,కాలేజ్ ఖమ్మం ని విడిచి అన్ని సర్దుకొని వస్తున్నప్పుడు రాసుకున్న కవిత)