జీవితం - నాన్న (వచన కవితా సౌరభం ) ### కవీశ్వర్
జీవితం - నాన్న (వచన కవితా సౌరభం ) ### కవీశ్వర్


జీవితం - నాన్న (వచనకవితాసౌరభం)
ఇలపై నిల్పిన సంకల్ప హేతువులు అమ్మా నాన్నలు
జీవన గమ్యాన్నిఅవగాహన కల్పించిన పృథ్వీ లోక దేవతలు
చదువు సంధ్యలందు ,ఆట పాటల అందు మార్గదర్శకుడు ఈ నాన్న
బంధాలను, అనుబంధాలను ఈ లోకం లోపాటించి,పాటింప జేసిన నాన్న.
సంసారాన్ని ఏ విధంగా సాగించాలో , మంచి కుటుంబాన్ని ఎలా నిర్మించాలో
ఆచరించి చూపించిన ఈనాన్నగారు. చిరకాలంగా గుర్తుంచుకునే ఆతని పిల్లలు.
పండుగలు ,సంప్రదాయాలను అనుసరించి , అనుసరింప ఈనాన్న మా నాన్న .
బొమ్మరిల్లు సినిమాలో చెప్పినట్లు గా "అంతా మీరే చేశారు అని అన్నట్లుగా"
నాన్న ఆలా చేయడం వల్ల మనకు (పిల్లలకు) దారి తప్పకుండా, క్రమ పద్ధతిలో
జీవింప జేసిన పధ్ధతి ఆచరణీయం , మనం సంపాదిస్తే మన ఇల్లు నిలుస్తుంది.
చిన్నప్పటినుండి వివిధ ఆచరణీయ మార్గాలను అనుసరించే విధం నేర్పిన నాన్న.
ఇప్పటికీ , ఎప్పటికీ ఆదరణీయుడు మీ, మా , మన నాన్న .చిర, మధురస్మృతులను పంచిన
నిరంతర శ్రమ జీవి , కరుణా మూర్తి ఆ, ఈ, మన నాన్న .
21.06. 2020 నాటి అంతర్జాతీయ పితృ దినోత్సవ శుభాభినందనలతో
***********************