మళ్లీ రావా బాల్యమా!
మళ్లీ రావా బాల్యమా!
శ్రీశ్రీ శైశవ గీతి గట్టిగా పాడాలని ఉంది
బుడుగు పాఠం చదవాలని ఉంది
పతంగులు ఎగురవేయాలని ఉంది
నాన్న పట్టుకుంటే సైకిల్ నేర్చుకోవాలని ఉంది
ఉసిరి కాయలు దాచి పెట్టుకుని తినాలని ఉంది
అమ్మమ్మ చెప్పే కథలు వినాలని ఉంది
సావాసగాళ్ళతో కలిసి సర్కస్ కి వెళ్ళాలని ఉంది
బొమ్మలు గీస్తూ ప్రపంచాన్ని మరచిపోవాలని ఉంది
ఏమిటో ఎప్పుడు ఇంత వాళ్ళం అయ్యామో తెలీకుండానే గడిచినట్టుంది
మాకోసం
మళ్లీ రావా బాల్యమా!