పుస్తక ప్రేమ
పుస్తక ప్రేమ
1 min
399
అమ్మ చూపించే ప్రేమ
నాన్న చూపించే మమకారం
పుస్తకం చూపించే దారులు
అన్న ఉంటే దైర్యం
అక్క ఉంటే అనురాగం
పుస్తకం ఉంటే తెలివి
గాలితో ఊపిరి
తిండితో శక్తి
పుస్తకంతో జ్ఞానం
కల్మషం లేని మనసు
శృతి మించని మాటలు
మనసా వాచా కర్మణా నమ్మితే పుస్తకాన్ని మించిన స్నేహం
పుస్తకం అందించే కర్మ ఫలం పోల్చలేనిది.
పుస్తకం అంటే కొన్ని కాగితాల కలయిక కాదు
మనిషి నడకని నడవడికలకు దిశా నిర్దేశాలను అందిస్తూ
కుల మత చిన్న పెద్ద ప్రాంతీయ భేదాలు లేకుండా అందరికీ జ్ఞానాన్ని అందిస్తూ సంపూర్ణమైన మానవత్వ బోధనను చేస్తూ నిరంతరం మానవ శక్తి యుక్తులను వారికి తెలిసేలా చేసేది పుస్తకం.