ప్రియ
ప్రియ
చిన్నప్పటినుంచి అమ్మ నాన్న దగ్గర
అల్లారు ముద్దుగా పెరిగి
ఎర్రవై సంవత్సరాలు వచ్చేసరికి
పెళ్లి పెళ్లి అంటూ చుట్టూ ఉన్న వాళ్ళు కంగారు పెడుతుంటే
మనశాంతి దూరం అయి
తల్లి తండ్రులకు దూరంగా
ఒక అజ్ఞాత వ్యక్తితో ముడి పడి
అత్త మామలు ఆడపడుచు
బావగారు అక్క అని ఎన్నో ఎన్నెన్నో కొత్త కొత్త బంధాలను కలుపుకుంటూ
భర్తను ఏవండీ ఏవండీ అంటూ ప్రేమగా పిలుస్తూ
సంతోషాన్ని పంచుతూ
ఆనందంగా చూసుకుంటూ
మరిన్ని కొత్త బంధాలకు పునాది వేస్తూ ముందుకు అడుగులు వేస్తాము
ఇవి అన్నీ మన సంతోషం కోసమే కాదు మన చుట్టూ ఉన్న వారి సంతోషం కోసం కూడా....

