ఏమని పాడనయా ------ కృష్ణ
ఏమని పాడనయా ------ కృష్ణ
ఏమని పాడనయా ------కృష్ణ
కటకటాలలో కిలకిలలాడిన
దేవకీ సుతుడైననూ యశోదనందన
పసికూనగానే పూతనను వధించిన
నీ లీలలనేమని పాడనయా ------కృష్ణ
"ఏమని పాడనయా "
ఘల్లు ఘల్లున నడిజామున
గజ్జల సవ్వడి విన్న నా గుండె ఝల్లుమనె
పరుగు పరుగున ఏతెంచి పొంచి చూచిన
కాంచితి నే నీ వెన్నంటిన వన్నెల మోమునే
కళ్లెర్రజేసీ కోపంతో నిను పట్టుకోదలచిన
ఇంతలోనే రమ్మంటూ అంతటా నీవున్నంతనే
అబ్బురపడి అనుకున్నా ఇదేమి సిత్రమన్నా ----- యశోద నందన
"ఏమని పాడనయా "
యమున తీరమున బృందావానిలోన
ఆ రాధ నీ రాకకై పరితపిస్తున్నంతనే
మధుర తరంగిణిలా నే మురళీ గానమున
తనువూగి డోలాలాడి పరవశించి పోయేనె
కనులకు కానరక కవ్విస్తూ దోబూచులాడిన
నీవే తన హృదయన్తర్గామివనే
ఆ రాధ ఆరాధనే తెలుసుకొని దరిచేరిన
కన్నా----గోపికాప్రియ గోపన్న
"ఏమని పాడనయా "
