స్నేహం
స్నేహం
సారుప్య భావాలు గల వ్యక్తుల మధ్య చిగురించే కుసుమం స్నేహం,
కాలాలు మారినా, తరాలు మారినా చెరిగిపోని అందమైన స్వప్నం స్నేహం,
దూరం పెరిగినా, దేశం దాటినా మరిచిపోలేని మధుర జ్ఞాపకం స్నేహం,
జీవితపు నావ కు చుక్కాని లా జత కట్టేది స్నేహం,
కష్టాల చీకట్లో నీడ లా తోడు గా నిలిచేది స్నేహం,
మనసు లో ని ఒంటరితనాన్ని తరిమి వేసే ఔషధం స్నేహం,
తనువు కు ఉత్సాహం ఇచ్చే ఉత్ప్రేరకం స్నేహం,
జీవిత చరమాంకం వరకు మనకు అమృత జల్లులు పంచె గొప్ప బంధం స్నేహం !!
