ఇంకేం చేయగలను..!!
ఇంకేం చేయగలను..!!
నిన్ను చూడాలని నా కళ్ళు కలవరపడుతున్నాయి,
కళ్ళలో వెలుగులు నింపుకుని…
నీ మాట వినాలని నా హృదయం కొట్టుకుంటోంది,
నీ పేరే జపం చేస్తూ…
నీ ముద్దు కోసం పెదవులు పరితపిస్తున్నాయి,
అదురుని అందంగా దాచుకుంటూ…
నీ స్పర్శ కావాలని తనువు తహతహలాడుతుంది,
నీకోసం సరిగమలు పలుకుతూ…
ఈ మాటలన్నీ మదిలో దాచుకోలేక,
సిగ్గు విడిచి నీ ముందు పరచలేక,
కల్మషం లేని నా ప్రేమను
ఎలా తెలియజేయలో తెలియక,
ఇలా కవితలల్లి, కాగితం మీద పరచి,
మురిసి మెరిసిపోవడం తప్ప,
ఇంకేంచేయగలను ప్రియతమా…

