ప్రేమ జల్లు
ప్రేమ జల్లు
కనులకు వెలుగు అనుకున్న నీ పరిచయం,
నేడు కానరాక కనుమరుగయ్యింది…
నీ చెదరని చిరునవ్వు చెరగని జ్ఞాపకంలా,
మరచిపోని గుర్తులా మిగిలింది…
తొలకరి చినుకులా కురిసిన నీ ప్రేమ అనే జల్లు,
నేడు వరదలా మదిని ముంచింది…
నా జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ నీ ఊసులతో నిండినది,
కానీ నేను నీ జీవితంలో ఒక పేజీగా మిగిలిపోయాను చెలి…
మనసు మరువదు ఎన్నటికీ ఈ మజిలీని,
నీ సంతోషం ఈ జీవితానికి అమృతవర్షిణి,
మదిలో ఈ అలజడికి కారణం నీ జ్ఞాపకాల తరంగిణి,
కడ దాకా కనుమరుగవ్వని భావతరంగిణి
