brother.. ❣
brother.. ❣
అన్నయ్య
ఈ పదం వినగానే తెలియని ధైర్యం, చెప్పలేనంత సంతోషం.
ఏ చెల్లికైనా ఒక అన్నయ్య ఉంటే ఏదైనా చేయగలం అనే నమ్మకం వస్తుంది.
ఒక ఆడపిల్లకి అమ్మానాన్నల తరువాత ఒక అన్నయ్య దగ్గరే స్వేచ్ఛ, రక్షణ ఉంటుంది.
ఎందుకంటే ఒక చెల్లి మనసు సంతోష పరిచే ఔషధం అన్నయ్య ప్రేమ.
నా కోపాన్ని మంచులా కరిగించే రూపం,
నా బాధని మాన్పే అద్భుతం,
నిజానికి నా సంతోషనికి చిరునామా ఈ మన బంధమే అన్నయ్య.
రక్త సంబంధానికి మించిన అనుబంధం మనది.
ఇన్నాళ్ళు నాకు అన్నయ్య లేడు అని బాధపడేదాన్ని,
కానీ ఇప్పుడు నాకు ఆ బాధ లేదు, రాదు కూడా.
మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్న అన్నయ్య..!!
