హోలీ
హోలీ
బాధలను హోళికా మంటలలో దహించి ఆనందాలను పంచే పండుగ హోలీ.
సప్త వర్ణాలు, చిరు జల్లులుగా మారి దేహాన్ని తడిపే రంగుల వేడుక హోలీ.
జనులలో ప్రేమానుబంధాలు వసంతంలా వికసించేలా చేసె సంబరం హోలీ.
రాధాకృష్ణుల ప్రేమ గీతాల గాన విభావరి మధుర హోలీ.
భక్తి పారవశ్యంతో చిందులు వేసే వినోదాల డోలిక హోలీ !!💛
