STORYMIRROR

Patlori pravalika

Classics Fantasy Inspirational Others

4  

Patlori pravalika

Classics Fantasy Inspirational Others

నన్ను కాసేపైనా ప్రేమించవా?

నన్ను కాసేపైనా ప్రేమించవా?

1 min
16

“నన్ను కాసేపైనా ప్రేమించావా?” .....
అని నువ్వు అడిగిన క్షణం నా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది…
ప్రేమను క్షణాల్లో కొలవగలమా?
సమయంతో తూకం వేయగలమా?
నిన్ను చూసిన మొదటి చూపు నుంచి ఈ క్షణం వరకు నా ప్రతి ఊపిరిలో నువ్వే ఉన్నావు…
కాసేపు అంటావా?
నీ మెసేజ్ కోసం రాత్రి నిద్ర పోకుండా గడియారం చూసిన ప్రతి నిమిషం కాసేపేనా?
నీ బాధ వినగానే నా కళ్లలో నీకోసం జారిన కన్నీళ్లు కాసేపేనా? నువ్వు నవ్వితే నా రోజు మొత్తం వెలిగిపోవడం కాసేపేనా? నువ్వు కోపంగా ఉంటే నా మనసు తట్టుకోలేక వందసార్లు “సారీ” చెప్పాలనిపించడం కాసేపేనా?
ప్రేమను నేను మాటల్లో చూపించలేకపోయానేమో,
కానీ నా మౌనంలో కూడా నీ పేరు ప్రతిధ్వనిస్తోంది…
 నువ్వు కాసేపు అడిగితే నేను జీవితాన్ని ఇచ్చేదాన్ని…
నువ్వు ఒక రోజు అడిగితే నేను శాశ్వతాన్ని ఇస్తాను… ఎందుకంటే నా ప్రేమ సమయంతో మొదలైనది కాదు, సమయంతో ముగిసేది కాదు…
 “కాసేపైనా ప్రేమించావా?” అని అడగకు…
నిన్ను ప్రేమించటం నా అలవాటు కాదు, నా ఉనికి…
నీ చేతిని పట్టుకుని జీవితం మొత్తం నడవాలని ఉంది… క్షణాలు కాదు, కాలమే మన ప్రేమకు సాక్షి కావాలి…
కాసేపు కాదు… నిన్ను నేను జీవితాంతం ప్రేమించాను… ప్రేమిస్తాను… 💖


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics