Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Children

4  

Gayatri Tokachichu

Children

దివ్వెల వెలుగుల దీపావళి

దివ్వెల వెలుగుల దీపావళి

1 min
291


*దివ్వెల వెలుగుల దీపావళి*


బాలల్లారా రారండీ!బంగారు పిల్లలూ రారండీ!

మతాబులెన్నో తెచ్చామండీ!టపాసులెన్నో వచ్చాయండీ!

ప్రొద్దున నిద్దుర లేవండీ!బుద్ధిగ స్నానం చెయ్యండీ!

క్రొత్త బట్టలు తొడగండీ!త్వరత్వరగా తెమలండీ!

పెద్దవారికి మ్రొక్కండి!ముద్దుగ కబుర్లు చెప్పండి!

పువ్వులు కోసుకు రారండీ!పూజలు చేసి వద్దామండీ!

గుడిలో గంటలు కొట్టండి!కొల్చుచు జేజెకు మ్రొక్కండి!

మిఠాయి లివిగో చూడండి!మేలుగ చెలులకు పంచండి!

కమ్మనిపండుగ విందండీ!కలిసి భుజించగ రారండీ!

మట్టిప్రమిదలు తెచ్చామండీ!మక్కువ మీరగ వెలిగించండి!

నూలు బట్టలే ధరించండి!నూతన కాంతులు వెదజల్లండి!

హాయిగ టపాసులు కాల్చండి!ఆనందంగా గడపండి!

దివ్వెల వెలుగుల దీపావళి!నవ్వులు పంచే తారావళి. //


Rate this content
Log in

Similar telugu poem from Children