STORYMIRROR

Dinakar Reddy

Abstract Children Stories Children

4  

Dinakar Reddy

Abstract Children Stories Children

ఉడతా ఉడతా ఊచ్

ఉడతా ఉడతా ఊచ్

1 min
394

ఉడతా ఉడతా ఊచ్

ఎక్కడికెళతావోచ్ అని అడిగాను

మీ ఇంటికే వస్తానోచ్ అంది

తప్పకుండా రావోయ్

బెల్లం అటుకులు తింటావా

దోసె గింజలు తిందామా

రావోయి ఉడతా అని పిలిచాను

ఇంటి వెనుక నిద్ర గన్నేరు చెట్టు

చెట్టు కింద నేను

చెట్టు పైన ఉడత

వేసంకాలం ఉదయాలు

ఆ ఉడతతోనే నా కాలక్షేపం

నా బాల్యంలో ఆ రోజులు మరచిపోలేని అనుభవం

తరువాత ఎన్నో ఉడుతలు వచ్చేవి

పిచ్చుకలు పావురాలు నా చేతులపైన ఎక్కి ఆడేవి

కల్మషం లేని లేత మనసు

పక్షులతో అట్టే కలిసిపోయింది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract