నాన్న
నాన్న
నాకు నడవడం నేర్పించింది నీ అంతిమ యాత్ర కోసం అనుకోలేదు,
నాకు మాట నేర్పింది నీ మరణ వార్త వినిపించడానికి అనుకోలేదు,
కంటికి రెప్పలా నన్ను కాచుకున్న నువ్వు ఇప్పుడు నా కళ్ళ లొ నీటి వలె మారి కారిపోతావు అనుకోలేదు,
నా హృదయంత్రాలలో నిలిచిన నీ రూపం కనుమరుగవుతుంది అనుకోలేదు,
కటిక చీకటిలో కూడ వెలుగై నన్ను ముందుకు నడిపిన నువ్వు నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు
ఎలా బ్రతకాలో... తెలియడం లేదు నాన్న
ఒక్కసారి లేచి బ్రతికే మార్గం చూపించవా నాన్న
