STORYMIRROR

శ్రీలత "హృదయ స్పందన"

Tragedy

4.5  

శ్రీలత "హృదయ స్పందన"

Tragedy

😥తీరని బాధ!

😥తీరని బాధ!

1 min
334


ఎందుకు ఇంత బాధ నాకు ?

కళ్లలో ఆనకట్ట వేయలేని జలపాతాలు

హృదయంలో చల్లార్చలేని అగ్నిగోళాలు

మనసులో అంతులేని ఆవేదనల భారం

 

ఎవరు నువ్వు ?

నా మనసులో చెరగని ముద్ర వేసుకొని కూర్చున్నావు .

ప్రతి పనిలో నువ్వే ,

ప్రతి ఆలోచన నీకోసమే ,

నా గుండె చప్పుడు నాకే కొత్తగా ,

భయంగా వినిస్తుంది .

ాని నిద్రకోసం కనులతో పోరాటం ,

చెరగని జ్ఞాపకాలకోసం మనసుతో పోరాటం ,

అందని ప్రేమ కోసం ఆశలతో పోరాటం ,

అణువంత ప్రేమకోసం హృదయంతో పోరాటం .

ఇంత బాధలో కూడా నిన్ను ప్రేమిస్తున్నాను

నా కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను .

నాకు నీ ప్రేమ కావాలా ?

నా ప్రాణం కావాలా అనిపిస్తే

ప్రేమే కావాలి అని కోరుకుంటా.

శ్రీ .

హృదయ స్పందన .



Rate this content
Log in