STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

"తెలుగు కవన ప్రశస్థి " kaweeshwar

"తెలుగు కవన ప్రశస్థి " kaweeshwar

1 min
311

"తెలుగు కవన ప్రశస్థి "

వచన కవితా గేయం 

కవీశ్వర్ : 26 .06 . 2022 


పల్లవి : భరత మాత యందొదిగిన సుందర తెలుగు తల్లీ 

వినీల కవితాకాశాన విరిసిన సుమపరిమళచందన కల్పవల్లీ 

నిత్యనవ్యత కల్గిన రసరమ్య చిత్రిత కవన సజీవ సిరిమల్లీ

గతవైభవ స్మరణస్ఫూరణచే పందిరిలో తులతూగే జ్ఞానవెల్లీ

                                   || భరత మాత ||

చరణం 1 : పోతన, తిక్కన, నన్నయ నారికేళ ,ద్రాక్ష పాక రసఝరి

త్యాగరాయ ,అన్నమయ్య ,రామదాస సంకీర్తనల శ్రవణ మాధురి

భువన విజయ కీలక కవితా గోష్తిచర్చా పూరణల ప్రఖ్యాత సుమధురి

తెలుగు భాషకు కల్గిన సమోన్నత సోపానాధిరోహణ కావ్య కలనసిరి 

                                    ||భరతమాత ||

చరణం 2 : సెలయేరులా, సుమధుర వాహినీ గీత రచయితల సంగమం  

సుస్వరాల మిళిత కర్ణపేయ జ్ఞానేంద్రియ ప్రేరిత విఖ్యాత జనరంజనం 

గాత్రాన్నందించిన నేపథ్య గాయనీ గాయకుల గాత్ర సుమనాలంకార రజం

వీరందరి జీవన మార్గానుసంధాన మాధ్యమ ఉత్కృష్ఠ స్మృతిపథ ప్రసారం 

                                     ||భరతమాత ||


Rate this content
Log in

Similar telugu poem from Abstract