తామసి లోకం
తామసి లోకం
తామసి లోకం
నాది తామసి లోకం
అక్కడ మౌనముద్రలు
మనసు పోరాటాలు
తపస్సు భంగిమలు
తపనల తహతహలు
అరవిరిసిన ఊహలు
ఆరబోసిన స్వప్నాలు
ఏడు దిగంతాలలో
ఏకాంతవాసాలు
ఊహల్లో ఊయలలూగుతూ
విహరించే విదూషిమణిలు
విపంచి అయి రచించే రాతలు
అంతరంగాల అంతఃక్రీడలు
అవలోకన సాగరాలు
అంతర్మథనాల ప్రవాహలు
విప్లవగీతాలు రాయలేక
విరాగినిలా వైరాగ్యం రచించే
వేదన లోకం.. నాది తామసి లోకం..
