స్వీయ ప్రేరణ
స్వీయ ప్రేరణ
ఒంటరి ప్రయాణం తో అలసి వెనకడుగేస్తే ఎలా!
అలసి సొలసి వెనకకు వెళ్ళిన అలకూడ ఉవ్వెత్తున ఎగసి పడుతుందని గుర్తుంచుకో !!
కష్టాలు కలవరపెడుతున్నాయని, విమర్శల వంటి రాళ్ళు పడి మనసు గాయపడుతోందని కృంగిపోతే ఎలా!
కటినమైన రాయి కూడా అనేక గాయాలతోనే అపురూపమైన శిలగా మారుతుందని గుర్తుంచుకో!!
గమ్యాన్ని చేరే నీ దారి అంధకారమని అధైర్యపడితే ఎలా!
దీపానికి మాత్రమే చీకటిని జయించే గుణముందని గుర్తుంచుకో!!
పరాజయం వెక్కిరిస్తోందని ప్రయాణమాపితే ఎలా!
మాపటికి అస్తమించిన సూర్యుడు కూడా తిరిగి మెల్కోపుతాడని గుర్తుంచుకో!!
ఒంటరిగా యుద్ధం చేయడం ఎంత కష్టమో..
సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతే కష్టం
దానికే యుద్దాన్ని ఆపి సంగ్రామాన్ని వదిలి పారిపోతే ఎలా!!
పారిపోయిన ఆ ప్రాణానికి విలువెక్కడుంది??
చివరగా,
జీవితం అనే మహా యుద్ధాన్ని గెలవాలంటే..
చివరివరకూ
పట్టుదల అనే ఆయుధాన్ని విడవకూడదని గుర్తుంచుకో!!
లే! లేచి పరిగెత్తు!!
ఆయాసం వచ్చి ప్రయాస పడెవరకూ కాదు,
ఆయువు ఆగి ప్రాణం పోయె వరకూ పరిగెత్తు
చమట చుక్క చిందేవరకూ కాదు,
రక్తపు బొట్టు నేల జారేవరకూ శ్రమించు
విజయ తీరాలు చేరేవరకూ కాదు,
దేహం పాడిమీద పడే వరకూ పోరాడు