STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

సూసైడ్

సూసైడ్

1 min
539

అపజయం.. అవమానించెన్

అసమర్థత...వెక్కిరించెన్


ప్రతికూలత పరిహసించెన్

విఫల ప్రేమ వెర్రెక్కించెన్

నమ్మకం.. మోసగించెన్

మనసు ఒంటరి చేసెన్


ఒంటరితనం గుండెను బాధించెన్

తలపులు ఆత్మను వేదించెన్

తనువు స్వీయ హింస కోరెన్

కన్నీటి ధారలు ఏరులై పారెన్

చిత్తం చితికొరకు ఎదురు చూసెన్

బుధ్ధి వద్దని బోధ చేసెన్


మేధస్సు మనస్సు సంఘర్షణలో

కన్నులు ఎరుపెక్కి రెప్పలు బరువెక్కి

హృదయం వెక్కెక్కి కడుపు కక్కి కక్కి

తనువు చిక్కి చిక్కి

మరణ తరుణమాసన్నమైనదని 

గుండెకు భయమెక్కి


అమ్మ నాన్నలకు చెప్పుకోలేక

మిత్రులతో పంచుకోక

మనోధైర్యం మందగించి

బతుకుపై ఆశ నశించి

అంతరాత్మ అల్లకల్లోలమై

ఆలోచనలు ఆవిరై


అణిచివేత హద్దులు దాటి

అణుచుకోలేక..

ఆత్మహత్యను ఆహ్వానించిన..


నాటితో..నా గుండె నిశ్శబ్ధం

ఆత్మ వెతికెను పరమార్థం

ఆత్మకిపుడు తెలిసెన్

ఆత్మహత్య ఎంత పాపమో

కన్నవాళ్ళకి ఎంత శాపమో!


పోతే యే బాధ ఉండదు అనుకుని

ఆశపడ్డ నాకు

సచ్చినక తెలిసింది

స్వర్గం లేదు..నరకం లేదు

యే రాగం లేని గీతం కోసమా

యే రూపం లేని శూన్యం కోసమా

నా ప్రాణాలు వదులుకున్నదని


మిత్రమా..

బతుకంటే..బాధ బతుకంటే.. వ్యధ

బతుకంటే.. గాధ బతుకంటే..శోధ

బతుకంటే చరిత

అందుకే..

నీ చరితను నువ్వే రాసుకొనే వరకు

బతకాలి చచ్చే వరకు బతకాలి

చేతనైతే చచ్చాక కూడా బతకాలి

దానికోసమే బతుకంతా వెతకాలి


    ......... రాజ్......



Rate this content
Log in

Similar telugu poem from Tragedy