నీ కోసం!
నీ కోసం!
ప్రియా,
ప్రభాత వేళ తొలిపొద్దు కిరణాన్నై వస్తాను.
నిశీధి నీడలో వెన్నెలై వస్తాను నేను.
శిశిరంలో వెచ్చని కౌగిలై వస్తాను..
ఇది విరహమో.. మోహమో..
వీడలేని ప్రేమో.. మరి...
వాడిపోయే నా మనసు
నీ స్నేహపు చిరుజల్లుల్లో
మళ్ళీ చిగురించాలి..
జాబిలై కురిపించే నీ ప్రేమ వెన్నెలలో నేను నిలువెల్లా తడిసిపోవాలి..
నీ జ్ఞాపకాల సంద్రంలో నేను కొట్టుకుపోవాలి..
శ్రీ...
హృదయ స్పందన.
