రైతు వేదన
రైతు వేదన
అతని పలకరింపుకు
తొలకరి సైతం పులకరించి పోతుంది
అతని స్పర్శ కై
నేలతల్లి సైతం పరవశించి పోతుంది
అతని రాకతో
పంట పైరు ఉర్రూతలూగి పోతుంది
అతని స్వేదం చూసి
కష్టం కూడా కరిగిపోతుంది
అతని స్థైర్యాన్ని చూసి
శ్వాస కు సైతం ఆశ పుడుతుంది
ఆకలి తీర్చే అలాంటి అన్నదాత
నేడు పొట్ట చేత బట్టి
పోరు బాటకై గల్లి వదిలి ఢిల్లీ
పయనమయ్యాడు
కరుణ లేని కరువుతో కాదు నేటి పోరు
ప్రకృతి వైపరీత్యాల పై అంతకన్నా కాదు
పేరు పలుకుబడి వున్న దళారులతో
మట్టి యుద్ధం కాదు మనుషులతో యుద్ధమని
గెలవడం అంత సులభం కాదని
అందుకే చేయి చేయి కలిపి
ఐక్యగొంతుతో గళం విప్పడానికి
దేశరాజధాని కి కర్తవ్యదీక్షతో
ముందడుగు వేసి సాగుతున్నాడు
విజయీభవ అంటూ సంకల్పం
దీవించసాగింది
