ఆకాశం నెత్తురోడుతోంది
ఆకాశం నెత్తురోడుతోంది


ఆకాశం నెత్తురోడుతోంది
ఆమె లిప్స్టిక్ రంగులో ఆకాశం నెత్తురోడుతోంది
అంధకారం అతని కళ్ళని చుట్టుముట్టింది
ఆమె నల్లని కురుల లాగా
వేల వికృత రూపాలు అతడిని ఆహ్వానించాయి
ఆమె విచిత్రపు కౌగిలిలో
కనిపించని ఆమె పలు వరుసలు
అతడి నాలుకని బంధించాయి
ఆమె వికటాట్టహాసం అతడిని
విషణ్ణుడిని చేసింది
ఆత్మ లేని ఆమె శరీరం అతడిని విగత జీవుడిని చేసింది
అతని ప్రతి రాత్రిని కాళరాత్రిగ మార్చింది
జీవం లేని ప్రియురాలు అతడిని జీవచ్ఛవంగా మార్చింది
ఆకాశం నెత్తురోడుతోంది
అతని నరాలు తెగడంలోని చప్పుడు వినడంలో ఆకాశం లీనమైంది