STORYMIRROR

Dinakar Reddy

Abstract Children Stories Inspirational

4  

Dinakar Reddy

Abstract Children Stories Inspirational

సూపర్ హీరో

సూపర్ హీరో

1 min
331

ఎవ్వరూ రారు

అన్యాయాన్ని ప్రశ్నించడానికి

అన్నార్తులను ఆదుకోవడానికి

కొత్తగా ఎవ్వరూ రారు


పైనుంచి ఎగురుతూ కాదు

పీడిత సమాజపు సమూహం నుండి

వెర్రిగొంతుక ఒకటి బయటికి రావాలి

అసహనం ఆలోచనలకు దారి చూపి

సరైన మార్గంలో ముందుకు నడవాలి


నువ్వే ఆ సూపర్ హీరో

మనలోని ప్రతి ఒక్కరికీ ఆ సూపర్ హీరో అయ్యే అర్హత ఉంది

అర్హతే కాదు

బాధ్యత కూడా ఉంది

ఆలోచించాల్సిన బాధ్యత

మనం మరచిపోయిన బాధ్యత

కార్టూన్లు చూసే పిల్లలు నలుగురికీ సాయం చెయ్యడం గొప్ప విషయం అని భావించిన పిల్లలు

భావి పౌరులు

ఎదిగే కొద్దీ ఎందుకు సమాజానికి దూరమవుతున్నాడు


ఎందుకు అసహ్యించుకుంటున్నాడు

ఎక్కడ తప్పు జరుగుతోంది

సరి చేయాల్సిన బాధ్యత మనకు లేదంటారా?


Rate this content
Log in

Similar telugu poem from Abstract