STORYMIRROR

ARJUNAIAH NARRA

Abstract

4  

ARJUNAIAH NARRA

Abstract

స్త్రీ మాతృ మూర్తి

స్త్రీ మాతృ మూర్తి

1 min
524

నేను పుడమి నందు పురుడు పోసుకున్న పుణ్యమూర్తిని

ఆకాశము నుండి ఆశీర్వదించే అద్భుత శక్తిని 

గాలి అందించి ప్రాణాలు నింపే వాయుదేవతను

పర్వతములందు నెలవైన పార్వతిదేవిని

అష్టదిక్పాలకులకు ఆలీని నేను


నేను పచ్చని ప్రకృతిలో వనదేవతను

రంగు రంగుల తీగల అకులలో లతాంగిని

కొండలల్లో కోనలల్లో నేను కోమలంగిని

అడవిలో నేను అపురూపమైన అమ్మ తల్లిని

నది సముద్ర జలశయాల్లో నేను జల కన్యను

వాగుల వంకల్లో నేను వయ్యారి భామను


సకల చర జీవరాసికి తల్లిని నేను

పేగును అందించి నిన్ను కన్న అమ్మను నేను

ఒడిలో మంచిని బోధించిన గురువును నేను

కాఠిన్యాన్ని తుంచి కారుణ్యాన్ని 

అందించిన అనురాగ మూర్తిని నేను

ప్రేమను పంచి పెంచిన త్యాగమూర్తిని నేను


నేను ఒక స్త్రీ మాతృ మూర్తిని....

విశ్వమందు వ్యాపించి ఉన్న విశ్వమాతను

పంచభూతమలందు పరివ్యాపితమైన ప్రజామాతను

అమ్మగా, సోదరిగా, భార్యగా మహోన్నత శక్తిని నేను

ఈ సృష్టిని సృష్టించిన స్త్రీ మాతృ మూర్తిని....నేను



Rate this content
Log in

Similar telugu poem from Abstract