స్కూలుకెళ్దాం
స్కూలుకెళ్దాం
1 min
487
పలకా బలపం పట్టుకుని
పరీక్షల భయం లేని స్కూలుకెళ్దాం
పరుగు పోటీలు దాగుడు మూతలు
పొద్దున్నే పద్యాలు మధ్యాహ్నం ఎక్కాలు
రోజూ కొత్త బొమ్మలు
సరి కొత్త ఆటలు
స్నేహాలు విరిసేదిక్కడ
విలువలు నేర్చేదిక్కడ
అలాంటి స్కూలుకు వెళదాం
ఆటల్లో పాటల్లో చదువులు చదివేద్దాం
మరీ విసుగు రాకుండా అల్లరి చేసేద్దాం
పరిసరాల పరిశుభ్రత ప్రకృతి పరిరక్షణ
మరెన్నో నేర్చుకుందాం
నేర్చుకున్నవి మరచిపోకుండా ఆచరిద్దాం
పదండి మరి స్కూలుకు వెళదాం