సీత
సీత


రక్కసుల మాటలు మనసున మంటలు రేపగా
జీవితము సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోవునని హేళన చేసినా
అందము దేహము లావణ్యము వృథా అని చెప్పినా
నిను కాపాడు వారెవ్వరూ లేరు రారు వచ్చినా
నిను ఇక్కడ నుండి తప్పించలేరు అని బెదిరించినా
కృంగి కృశించక తన దానివి కమ్మని రావణుడు హెచ్చరించినా
అయిన వారి తోడు లేని స్థితిలో కూడా
నమ్మకముతో నా స్వామి తప్పక తన కొరకు వచ్చునని
తనను తప్పక ఈ చెర నుండి విడిపించగలడని
పదే పదే చెప్పినది
నమ్మినది రఘు రాముని సీత
ఆమె విస్వాసమెంత బలమైనదో కదా
అట్టి సీతను పత్నిగా పొందిన రాముడెంతటి ధన్యుడో కదా!